గ్లోబల్ వార్మింగ్‌తో సతమతమవుతున్న ప్రపంచానికి ఓ శుభవార్త అందింది. చిల్లులు పడ్డ ఓజోన్ పొర తనకు తానే చికిత్స తీసుకుని పూడుకుంటోందని ఐక్యరాజ్యసమితికి చెందిన సైంటిఫిక్ అసెస్‌మెంట్ ప్యానెల్ వెల్లడించింది. 2022 నుంచే ఇది మొదలైందని తెలిపింది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు తగ్గడమే ఓజోన్ పొర కోలుకోవడానికి కారణమని పేర్కొంది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు ఇలానే తగ్గుతూపోతే 2066 నాటికి ఓజోన్ పొరలో కన్నం పూర్తిగా పూడుకుపోతుందని పేర్కొంది.