న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్‌ను పురుషుల క్రికెట్ టెస్ట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఇంగ్లండ్ నియమించింది. నాలుగేళ్లు ఈ హోదాలో కొనసాగనున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కోచ్‌గా ఉన్న మెకల్లమ్, జూన్ 2న లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో తన మొదటి ఇంగ్లండ్ షెడ్యూల్ ను ప్రారంభించనున్నాడు. 2019లో రిటైరైన మెకల్లమ్ 12 ఏళ్ల కెరీర్‌లో న్యూజిలాండ్ తరఫున 101 టెస్టులు ఆడాడు.