బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ నేడు ఇండియాలో పర్యటించనున్నారు. భారతదేశంతో భద్రత, రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకోవడం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో అన్ని దేశాలు వ్యూహాత్మకంగా రష్యాపై ఆధారపడటం తగ్గించడం గురించిన ప్రాముఖ్యతను ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. రష్యా దూకుడును ఎదుర్కోవాలని, ఆ దేశంపై వ్యూహాత్మకంగా ఆధారపడటాన్ని తగ్గించాలని మంత్రి కోరుకుంటున్నట్లు సమాచారం.