ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్ కొత్తగా కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో క్రిస్టియన్ సంఘాల నేతలు, ఉత్తరాంధ్ర బీసీ, ఎస్సీ, మైనారిటీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఏపీలో బీసీ అభ్యర్థి సీఎం అవ్వాలని అనుకుంటున్నట్లు అనిల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలు జగన్ పాలనలో పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఆయా వర్గాలు పార్టీ పెడితే తన మద్దతు ఉంటుందని తెలిపారు. సమయం వచ్చినపుడు వారి సమస్యల గురించి సీఎం జగన్ తో చెబుతానన్నారు. మరోవైపు జగన్ను కలిసి రెండేళ్లు దాటిందని అన్నారు. తను చాలా బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు.