రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం

Courtesy Twitter: cmo telangana

జాతీయ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయాలని చూస్తున్న టీఆర్ఎస్ పార్టీకి మరో ముందడుగు పడింది. భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా పార్టీ పేరు మార్పును అంగీకరిస్తూ ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. అక్టోబరు 5న తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చాలని పార్టీ అధిష్ఠానం ఎన్నికల సంఘానికి అర్జీ పెట్టుకుంది. ఈ లేఖకు ఈసీ బదులిచ్చింది. ఈ మేరకు రేపు మధ్యాహ్నం బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం, పార్టీ జెండా ఆవిష్కరణను జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రేపు మధ్యాహ్నం 1.20గంటలకు తెలంగాణ భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు.

Exit mobile version