ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. సభకు తెలంగాణ ప్రజలు ఎవరూ వెళ్లలేదని.. అందరూ హైదరాబాద్లో జరిగిన క్రికెట్ మ్యాచ్ చూశారని చెప్పారు. సభకు వచ్చిన జాతీయ నేతలకు వారెందుకు వచ్చారో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఒకరు కంటివెలుగు కార్యక్రమం చూడటానికి వచ్చామని.. మరొకరు యాదాద్రి చూడటానికి వచ్చామని.. ఇంకొకరు బహిరంగ సభకు రాలేదని చెప్పినట్లు తెలిపారు.