ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. కేసీఆర్ పెట్టిన పార్టీ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ‘జాతీయ రాజకీయాలపై అవగాహన ఉన్న కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆ పార్టీ ప్రభావం చూపబోదు. ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపరు. బీఆర్ఎస్ వల్లే ఏపీ ప్రజలు మోసపోయారు. ఆ పార్టీ ప్రభావం శూన్యం’ అని కొడాలి నాని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ సభల్లో ప్రజలు మరణించడంపై స్పందిస్తూ.. చంద్రబాబుని జామాతా దశమగ్రహం అని నాని అభివర్ణించారు.