TS: హైదరాబాద్ పాతబస్తీలో మరో హత్య జరిగింది. జియాగూడలో నడిరోడ్డుపైనే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతుడిని అంబర్‌పేటకు చెందిన సాయినాథ్(29)గా గుర్తించారు. బైక్‌పై సాయినాథ్ వెళ్తుండగా ముగ్గురు దుండగులు వచ్చి దాడి చేయడం ప్రారంభించారు. ఐరన్ రాడ్‌తో సాయినాథ్ తలపై బలంగా బాదారు. అనంతరం కిందపడేసి కత్తి, కొడవలితో శరీరంపై విచక్షణా రహితంగా దాడిచేశారు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసు అటువైపు వస్తుండగా నిందితులు పారిపోయారు. బాధితుడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం