• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఢిల్లీలో BS3, BS4 వాహనాలు నిషేధం

    ఢిల్లీలో కాలుష్యం ప్రమాద స్థాయిలోకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు స్థానికంగా బీఎస్-3, బీఎస్-4 డీజిల్ ఫోర్ వీలర్ వాహనాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతానికి శుక్రవారం వరకు ఈ వాహనాలపై తాత్కాలిక నిషేధం విధించింది. వాయు నాణ్యత స్థాయి ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, రాజధాని వాసులను చలి బెంబేలెత్తిస్తోంది.