దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న అనుకూల ధోరణులు సహా పలు అంశాల నేపథ్యంలో మార్కెట్ సూచీలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో ఒక దశలో BSE సెన్సెక్స్ 950 పాయింట్లు, NSE నిఫ్టీ 280 పాయింట్లు వృద్ధి చెందింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా 400 పాయింట్లు లాభపడింది. ఈ నేపథ్యంలో టైటాన్, HCL, అదానీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సంస్థల స్టాక్స్ ప్రస్తుతం టాప్ 5 లాభాల్లో ఉన్నాయి.