ఉత్తర్ ప్రదేశ్ లో అల్లుడికి కట్నంగా మామ ఇచ్చిన కానుక చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సుమేర్ పుర్ దేవ్ గావ్ గ్రామానికి చెందిన పరశురామ్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన కుమార్తెను నౌకాదళంలో పనిచేేసే యోగేంద్రతో వివాహం జరిగింది. పెళ్లి వేడుకలో అల్లుడికి బుల్డోజర్ కట్నంగా ఇవ్వటంతో అందరూ ఆశ్చర్యపోయారు. విలాసవంతమైన కార్లు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. తన కుమార్తే ఐఏఎస్ చదువుతోందని.. అది ఫలించకపోతే జీవనోపాధికి ఉపయోపడుతుందని చెప్పారు.