ప్రముఖ సీరియల్ నటి ప్రవీణ లలితాభాయ్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. తనను, తన కుమార్తెను ఢిల్లీకి చెందిన భాగ్యరాజ్ వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. గతంలోనూ ఇలాగే చేయడంతో భాగ్యరాజ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి తిరిగి విడుదలయ్యాక మళ్లీ వేధించడం ప్రారంభించాడట. దీంతో ప్రవీణ కుమార్తెతో కలిసి పోలసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరి ఫొటోలు మార్పింగ్ చేసి 100కు పైగా వెబ్సైట్లలో పోస్ట్ చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ‘పరంపర’ వెబ్‌సిరీస్‌లో, ఫిబ్రవరిలో విడుదల కానున్న ధనుష్ ‘సార్’ సినిమాలో ప్రవీణ నటించింది.