ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఓ హిందీ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను టీ సీరీస్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. కాగా ఈ మూవీలో హీరోగా నటిస్తున్న బన్నీ రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.125 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. దీంతో ప్రభాస్ తీసుకునే పారితోషికాన్ని దాటేశాడని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. కాగా ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీకి రూ.120 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.