హిజాబ్ వ్యతిరేక ప్రదర్శన చేసినందుకు ఓ యువతిని ఇరాన్ భద్రతా బలగాలు కాల్చివేశాయి. ఇటీవల 20 ఏళ్ల హదీస్ నజాఫీ హిజాబ్ తీసివేస్తూ, జుట్టు కత్తిరించుకుంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో అక్కడి భద్రతా బలగాలు నజాఫీని పట్టుకుని కాల్చివేశాయి. ఆమె మెడ, తల, ఛాతి భాగంలో బుల్లెట్లు దూసుకెళ్లడంతో మరణించింది. కాగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడిగిపోతోంది. ఈ ఆందోళనల్లో కొంతమంది మృత్యువాత పడగా, వేలాది మంది జైలు పాలయ్యారు. ఆ దేశ పరిపాలకులకు వ్యతిరేకంగా నినాదాలు మారుమోగుతున్నాయి.
జుట్టు కత్తిరించికున్నందుకు కాల్చివేత

© Envato