పంజాబీ ఫేమస్ సింగర్, కాంగ్రెస్ లీడర్ సిద్ధూ మూసే వాలా హత్యకు గురైన విషయం తెలిసిందే. దుండగులు అతనిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే సిద్ధూ అంత్యక్రియలను వరుడి వేషంలో నిర్వహించారు. 28 ఏళ్ల సిద్ధూకు ఇంకా పెళ్లి కాలేదు. దీంతో ఆచారం ప్రకారం అతడిని వరుడి వేషంలో ముస్తాబు చేశారు. తలపై పాగా, పెళ్లి వస్త్రాలు అలంకరించి దహనం చేశారు. కాగా నిన్న నిర్వహించిన సిద్ధూ అంతిమ యాత్ర కోసం ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన గాయకుడిని కడసారి చూసి కన్నీటితో వీడ్కోలు పలికారు.