ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురి కావడంతో 10 మంది సచివాలయ ఉద్యోగులు గాయపడ్డారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. ఉద్యోగులు వెలగపూడిలోని సచివాలయంలో విధులు ముగించుకుని బస్సులో ఇంటికి వెళ్తుండగా కాజ టోల్ ప్లాజా వద్ద సిమెంట్ దిమ్మెను ఢీకొట్టి చక్రం విరిగిపోవడంతో ప్రమాదానికి గురైంది. దీంతో బస్సులో ఉన్న 10 మంది ఉద్యోగులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్