ఆన్ లైన్‌లో గోల్డ్ కొంటే డబుల్ మనీ అంటు మోసం

© Envato

ఆన్ లైన్లో మరో సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. మీరు గోల్డ్, రాగి, వెండి, ప్లాటినం, పల్లాడియం వంటి వాటిపై పెట్టుబడి పెడితే మీ మొత్తం 48 రోజుల్లో 2 మూడు రెట్లు అవుతుందని చెబుతారు. అందుకు తగినట్టుగా కంపెనీ లోగో, బ్రోచర్లు ఏర్పాటు చేసి సైబర్ మోసగాళ్లు నమ్మబలుకుతారు. అంతే నమ్మి వాటిని కోలుగోలు చేస్తే ఇక అంతే సంగతులు. అటువంటి ఘటనలు ఇటీవల వరంగల్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్నాయి. లోహాలపై ఇన్‌వెస్ట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుందని ఓ వ్యక్తి రూ.50 వేలు పెట్టి మోసపోయాడు. మరో వ్యక్తి రూ.2.5 లక్షలు నష్టపోయాడు. మరోవైపు రాత్రి వేళల్లో లింకులు వచ్చాయని అవి నొక్కితే ఖాతాల్లో నగదు మాయం అయిందని బాధితులు చెబుతున్నారు. అలాంటి తెలియని లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version