మంత్రివర్గ విస్తరణ: వైసీపీలో అసంతృప్తి జ్వాల

Courtesy Twitter: Mekathoti sucharita

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గ విస్తరణను చేపట్టారు. ఇందులో కొత్తవారికి అవకాశం కల్పించగా.. కొందరు పాతవారిని కూడా ఉంచారు. అయితే మొదటి విడతలో మంత్రులుగా పని చేసిన కొందరికి పదవులు దక్కకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి బాలినేని, మేక‌తోటి సుచరిత, ధర్మశ్రీ, కొరముట్ల శ్రీనివాసులు ఇలా పలువురు పదవులు దక్కకపోవడంపై తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికే సుచరిత తన MLA పదవికి రాజీనామా చేశారు కూడా. మరి ఈ అసంతృప్త నేతలను వైసీపీ అధిష్టానం ఎలా శాంతపరుస్తుందో చూడాలి.

Exit mobile version