నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్‌లో భేటీ కానుంది. కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే గవర్నర్ కోటాలో రెండు స్థానాలకు అభర్థుల ఎంపికపై చర్ఛించనున్నారు. ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన భిక్షమయ్య గౌడ్, దాసోజ్ శ్రవణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి బండి నరేష్ ఎమ్మెల్సీ రేసులో ముందున్నారు.