ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు జరిగిన కేబినెట్ భేటీలో కీలక ప్రకటన చేశారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్వాసనకు గురవనున్న ప్రస్తుత మంత్రులు ఆందోళన చెందవద్దని, పార్టీ కోసం పనిచేయాలని సమావేశంలో కోరారు. ఇప్పుడు మంత్రివర్గం నుంచి తొలగించేబడే వారిలో కొందరిని జిల్లా ఇంఛార్జీలుగా నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే, కొంతమంది మంత్రులు తమ బాధ్యతలు కొనసాగిస్తారని మిగిలిన వారిలో కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. కాగా, కొత్త జిల్లాలు, సామాజిక ఆర్థిక సమతుల్యత అంశాలను మంత్రివర్గ విస్తరణలో పరిగణించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 26 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. మార్చి 15న ప్రస్తుత మంత్రివర్గం మరోమారు భేటీ కానుంది.