ఎయిర్ ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్(CEO), MDగా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో అనుభవజ్ఞుడైన క్యాంప్‌బెల్ విల్సన్‌ను నియమించినట్లు టాటా సన్స్ పేర్కొంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా బోర్డు ఆమోదించింది. 50 ఏళ్ల విల్సన్ కు ఎయిర్‌లైన్స్ విభాగంలో 26 సంవత్సరాల అనుభవం ఉందని టాటా సన్స్ ప్రకటించింది. ఎయిర్ ఇండియా టాటాలో చేరినందుకు సంతోషిస్తున్నట్లు విల్సన్ చెప్పారు. భారతీయ ఆతిథ్యాన్ని ప్రతిబింబించే కస్టమర్ అనుభవం ఎంతో గొప్పదని గుర్తుచేశారు. మరోవైపు ఎయిర్ ఇండియా ఛైర్మన్ చంద్రశేఖరన్ క్యాంప్‌బెల్ కు స్వాగతం చెప్పారు. తన సేవలు ఎయిర్ ఇండియాకు ప్రయోజనం చేకూరుస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.