విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్లో మూడు మ్యాచుల్లో రెండు శతకాలు బాది మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెల్చుకున్నాడు. మూడో వన్డేలో చేసిన సెంచరీ కోహ్లీకి 46వది. సచిన్(49) కన్నా మూడు సెంచరీలు మాత్రమే వెనకబడ్డాడు. దీంతో సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ తిరగరాస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. రేపటి నుంచి న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ మరోసారి చెలరేగడం ఖాయం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో 4 సెంచరీలు సాధిస్తే వన్డేల్లోనే అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మన్గా కోహ్లీ రికార్డులకెక్కుతాడు.