TS: ఎన్నికలకు నెలరోజుల ముందు పార్టీ మార్పుపై ప్రకటన చేస్తానని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు. ఇంతవరకు నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చింది తనేనని వెంకట్రెడ్డి వెల్లడించారు. తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పార్టీ నియమాలకు విఘాతం కలిగించారని వెంకట్రెడ్డికి పార్టీ నోటీసులు జారీ చేసింది.