ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు చాలా మంది అభిమానులుంటారు. ఎక్కువగా ఆదరించే క్రీడ కూడా అదే. అందుకే ఫిఫా వరల్డ్ కప్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ వరల్డ్ కప్‌లో 37 ఏళ్ల తరువాత కెనడా జట్టు అర్హత సాధించింది. జమైకా జట్టుతో టొరంటోలో జరిగిన మ్యాచ్‌లో 4-0తో గెలిచినా కెనడా జట్టు వరల్డ్ కప్‌కు అర్హత పొందింది. గతంలో 1986 ప్రపంచకప్ కు అర్హత సాధించింది. సుదీర్ఘ కాలం తరువాత వరల్డ్ కప్‌కు క్వాలిఫై అవడంతో ఆ జట్టు ఆనందంలో మునిగిపోయింది. దీంతో ఫిఫా వరల్డ్ కప్-2022కు అర్హత కాన్ఫిడరేషన్ ఆఫ్ నార్త్, సెంట్రల్ అమెరికా, కరేబియనల్ అసోసియేషన్(CONCACF) ఫుట్‌బాల్ కెనడా నిలిచింది.