ప్రశ్నాపత్రాలు లీకేజీ వేళ.. గ్రూప్ 1 ప్రిలీమ్స్ పరీక్షలు రద్దయ్యాయి. ఈమేరకు TSPSC అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏఈఈ, డీవోఈ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ఆఫిసర్ పరీక్షలను TSPSC రద్దు చేసిన సంగతి తెలిసిందే. జూ. లెక్చరర్ పరీక్షలను మాత్రం వాయిదా వేసింది. గ్రూప్ 1 ప్రిలీమ్స్ పరీక్షలను మళ్లీ జూన్ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.