కామారెడ్డి టౌన్ మాస్టర్‌ప్లాన్ రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పాత ముసాయిదా డ్రాఫ్ట్‌ను రద్దు చేస్తున్నట్లు పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని వారం రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కామరెడ్డిలో పారిశ్రామిక జోన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ముసాయిదా డ్రాప్ట్ ప్లాన్ చేసింది. దీనివల్ల పెద్దఎత్తున వ్యవసాయ భూములు కోల్పోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చేశారు.