హత్యాయత్నం కేసులో జైలు శిక్ష పడటంతో లక్ష్యద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేేషన్ విడుదల చేసింది. కవరత్తి కోర్టు జనవరి 11న తీర్పు వెలువరించగా… అప్పట్నుంచే అనర్హత వేటు అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీఎం సయీద్ అల్లుడు పదాంత సాలిహ్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫైజల్‌పై ఆరోపణలున్నాయి. 2009 లోక్‌సభ ఎన్నికల వేళ ఈ ఘటన జరిగింది.