వేల సంవత్సరాలుగా మానవాళిని వణికిస్తున్న క్యాన్సర్ మహమ్మారికి మందు దొరికేసిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. న్యూయార్క్ లో తాజాగా జరిగిన ఓ క్లినికల్ ట్రయల్ ఈ వైద్య శాస్త్ర అద్భుతం నిజమేనని చెబుతోంది. 18 మంది రెక్టల్ క్యాన్సర్ బాధితులకు 6 నెలల పాటు అందించిన ఓ కొత్త డ్రగ్ సత్ఫలితాలనిచ్చింది. ప్రతి రోగిలోనూ మహమ్మారిని పూర్తిగా పారదోలింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఈ 18 రోగులకు డోస్టార్లిమబ్ (Dostarlimab) అనే ఔషధాన్ని అందించారు. వీరిలో ఏ ఒక్కరికీ దుష్ఫలితాలు రాలేదని, క్యాన్సర్ కణితి పూర్తిగా నయమైనట్లు వైద్యులు చెబుతున్నారు.