కరోనా మహమ్మారితో ఎదురైన అధిక ద్రవ్యోల్భణం, నిరుద్యోగం వంటి సమస్యలను 100 రోజుల్లో పరిష్కరించలేమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. శనివారం ‘రోజ్గార్ మేళా’లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వోద్యోగం సాధించిన 75వేల మందికి ప్రధాని నియామక పత్రాలు అందజేశారు. ‘కరోనా వల్ల ఎన్నో దేశాలు నష్టపోయాయి. మహమ్మారి లాంటి సమస్యలు 100 ఏళ్లకోసారి వస్తాయి. దీని ద్వారా ఎదురైన సమస్యలను 100 రోజుల్లో పరిష్కరించలేం. దీని నుంచి బయటపడేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టాం’ అని మోదీ చెప్పారు.
100 రోజుల్లో పరిష్కరించలేం: మోదీ

© ANI Photo(file)