వన్డే ప్రపంచకప్‌నుక సమయం సమీపిస్తున్న వేళ టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు తొలి ప్రపంచ కప్ అందించిన కపిల్ దేవ్… మెగా టోర్నీ గెలవాలంటే ఇప్పటినుంచే సన్నద్ధమవ్వాలన్నారు. విరాట్, రోహిత్ వంటి ఇద్దరు ముగ్గురు సీనియర్లపైనే ఆధారపడటం సరికాదని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరితో కప్ గెలవడం సాధ్యం కాదని చెప్పుకొచ్చాడు. ప్రపంచ కప్ గెలవాలంటే కోచ్, సెలెక్టర్లు, టీం మేనేజ్‌మెంట్ కొన్న కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.