• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆటోను ఢీకొన్న కారు.. నలుగురు మృతి

  మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతిచెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్మూర్‌ మండలం ఆలూరుకు చెందిన ఆరుగురు గజ్వేల్‌కు ఆటోలో వెళ్తున్నారు. మార్గంమధ్యలో ఆ ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv