70వ మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో గల కోకా-కోలా మ్యూజిక్ హాల్‌లో నేడు జరిగాయి. ఈ పోటీలలో మొత్తం నలభై దేశాలకు చెందిన మోడల్స్ పాల్గొన్నారు. ఇండియా తరపున మానస వారణాసి ప్రాతినిథ్యం వహించింది. ఈ పోటీలలో పోలాండ్ కు చెందిన కరోలినా బియాలస్కా ఇంటర్నేషనల్ బ్యూటీ పాజెంట్ మిస్ వరల్డ్-2021గా నిలిచింది. అమెరికాకు చెందిన శ్రీ షైనీ మొదటి రన్నరప్‌గా నిలిచింది.