అపరకుబేరుడు ముఖేశ్ అంబానీ అత్యంత విలాసవంతమైన కార్లు ఉపయోగిస్తారు. రోల్స్ రాయిస్‌కు చెందిన ఫాంటమ్ SUV ముఖేశ్ గ్యారేజీలో ఉంటుంది. దీని ధర ఏకంగా రూ. 13.50 కోట్లు. ఆయన వినియోగించే వాటిలో జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మే బ్యాచ్ S660 ఒకటి. దీని విలువ రూ.10.50 కోట్లు ఉంటుంది. BMWకి చెందిన రూ.8.9 కోట్లు విలువ చేసే 760ఎల్‌ఐ సెక్యూరిటీ కారు కూడా ఉపయోగిస్తారు. అంబానీ గ్యారేజీలో మరో ఖరీదైన కారు ఫెరారీ SF90 స్ట్రాడేల్. దీని ధర రూ.7.50 కోట్లుగా ఉంది.