• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భీమ్లా నాయక్ సినిమాపై కేసు నమోదు

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్ సినిమాపై కేసు నమోదైంది. చిత్రంలోని ఓ సన్నివేశంలో రానా కమ్మరి చక్రాన్ని కాలుతో తన్నారని అది తమ మనోభావాలను దెబ్బతీసిందని ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ ఎం.పురుషోత్తం ఆరోపించారు. ఈ మేరకు గుంటూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన ఆయన, వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా విడుదలైనప్పటి నుంచి వసూళ్ళలో దూసుకుపోతున్న భీమ్లానాయక్‌కు ఆదిలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల ఆంక్షలు విధించింది. తాజాగా ఈ కేసుతో వివాదాల్లో చిక్కుకుంది.