చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై కేసు నమోదైంది. ఓ చెక్కు బౌన్స్ కేసులో ధోనీపై ఈ కేసు నమోదైనట్లు తెలుస్తుంది. అసలు విషయంలోకేళ్తే.. ఓ ఎరువుల ఉత్పత్తి కంపెనీ తమ ఎరువులను విక్రయించేందుకు ఓ ఏజెన్సీతో కలిసి పని చేస్తుంది. అయితే ఏజెన్సీ తమకు మార్కెటింగ్‌కు సహకరించడం లేదని ఆ ఏజెన్సీపై ఎరువుల తయారీ కంపెనీ ఆరోపణలు చేసింది. దానిని తోసిపుచ్చిన ఏజెన్సీ, కంపెనీ తమకు సహకారం అందించలేదని, తమకు నష్టం వచ్చిందని పేర్కొంది. ఈ క్రమంలోనే ఎరువులను ఆ కంపెనీకి ఇచ్చేయడంతో, వారు రూ.30 లక్షల చెక్కును ఇచ్చారు. అది బౌన్స్ అవడంతో ఏజెన్సీ ప్రతినిథులు ఆ ఎరువుల కంపెనీ, ఆ కంపెనీకి అంబాసిడర్ ధోనీపై కేసు నమోదు చేశారు.