ఏపీ సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో వివేకా కూతురు డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బావమరిది శివప్రకాశ్రెడ్డిలపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ-5 నిందితుడైన దేవిరెడ్డి శంకర్‌రెడ్డి భార్య తులశమ్మ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసింది. వివేకా కూతురు, అల్లుడు బావమరిదిపై సీబీఐ జరిపించాలని పిటిషన్లో కోరింది. తన భర్తను సెంట్రల్ జైలులో ఉంచారని, వీళ్ళను కూడా విచారించాలని డిమాండ్ చేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన పులివెందుల కోర్టు, తదుపరి హియరింగ్‌ను ఆగష్టు 30కి వాయిదా వేసింది.