సికింద్రాబాద్- దక్కన్ మాల్ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భవన యజమాని మహ్మద్, రహీంలపై కేసు ఫైల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేశారని విచారణలో తేల్చారు. ప్రమాదానికి కారణమైన మరో ముగ్గురు నిందితులు మిస్సైనట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై భవన యజమాని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో డెక్కన్ నైట్ వేర్ బిల్డింగ్ పూర్తిగా కాలిపోయింది. ఫిల్లర్లు బలహీనపడటంతో బిల్డింగ్‌ను కూల్చివేయాలని జీహెచ్ఎంసీ.. అధికారులను ఆదేశించింది.