హీరో సూర్య-జ్యోతిక దంపతులకు న్యాయస్థానం షాక్ ఇచ్చింది. జై భీమ్ సినిమాలో ఓ కులాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ రుద్ర వన్నియార్ కుల చత్రియార్ సంఘం అధ్యక్షుడు సంతోష్ నాయక్ కోర్టు మెట్లు ఎక్కాడు. ఈ విషయంపై విచారణ జరిపిన సైదాపేట కోర్టు నిర్మాతలు సూర్య-జ్యోతికలపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై ఇప్పటివరకు వీరు స్పందించలేదు. న్యాయం కోసం పోరాడే ఓ మహిళ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ హిట్ సాధించింది.