సైబర్ నేరస్థుల ఆగడాలు పెరుగుతున్నాయి. దక్షిణ దిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి ఓటీపీ అవసరం లేకుండా నగదు స్వాహా చేశారు.సెక్యూరిటీ సంస్థ నిర్వహిస్తున్న అతడి ఫోన్‌కు మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఓసారి లిఫ్ట్ చేసి ఎవరూ స్పందించకపోవటంతో వదిలేశారు. కొద్ది సమయం తర్వాత ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు బదిలీ అయినట్లు మెసేజ్ రావటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ. 50 లక్షలు కొట్టేసినట్లు గుర్తించారు. ఝార్ఖండ్‌కు చెందిన వారు మోసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.