TSRTCలో క్యాష్‌లెస్‌ టికెట్ సేవలు

© ANI Photo

ప్రయాణికుల మెప్పు కోసం నిరంతరం సరికొత్త ఆలోచనలతో ముందుకొస్తున్న TSRTC మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌, క్యూఆర్‌ కోడ్‌, యూపీఐ పేమెంట్స్‌తో టికెట్‌ కొనుగోలు చేసేలా సేవలను ప్రారంభిస్తోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌ రీజియన్‌లో ఈ విధానం అమలవుతుండగా, తాజాగా కరీంనగర్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. లగ్జరీ, గరుడ, గరుడ ప్లస్‌ వంటి వాహనాల్లో వీటిని ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం కొన్ని బస్సుల్లోనే ఈ సేవలు ప్రారంభించామని, దశల వారీగా పూర్తిగా విస్తరిస్తామని అధికారులు తెలిపారు.

Exit mobile version