బిహార్లో కుల జన గణన ప్రక్రియ ప్రారంభమైంది. వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసమే ఈ కులగణన చేపడుతున్నట్లు నితీశ్ ప్రభుత్వం చెబుతోంది. కులగణన ద్వారా బడ్జెట్ కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలు జరుగుతాయని పేర్కొంది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో, రెండు దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ సర్వేలో పాల్గొనే అధికారులకు పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చారు. కులగణన మే నెల వరకు కొనసాగుతుంది. ఈ సర్వేకు దాదాపు రూ.500 కోట్ల వ్యయం కానుంది.