డిజిటల్ లభ్యతలోనూ దేశంలో అసమానతలు పెరుగుతున్నాయని నివేదికలు బహిర్గతం అవుతున్నాయి. ఇది ఆందోళనకర స్థాయిలో ఉందని ఆక్స్ ఫామ్ ఇండియా వెల్లడించింది. భారత అసమానతల నివేదిక 2022, డిజిటల్ విభజన పేరిట రూపొందించిన రిపోర్టు ప్రకారం 2021లో దేశంలో ఫోన్ ఉన్న పురుషుల శాతం 61 ఐతే..మహిళలు కేవలం 31 శాతం మాత్రమే ఉన్నారు. డిజిటల్ లభ్యత ఎక్కువగా పురుషులు, పట్టణ ప్రాంతవాసులు, ఉన్నత కులాలు, వర్గాలకే పరిమితమైందని వెల్లడించారు.