• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Stock Market: రెండో రోజు లాభాల్లో మార్కెట్లు

    నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, కార్పొరేట్‌ ఫలితాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఉదయం సెన్సెక్స్‌ 63,885.56 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. చివరకు 329.85 పాయింట్ల లాభంతో 64,112.65 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,053.40 దగ్గర ప్రారంభమై 93.65 పాయింట్లు లాభపడి 19,140.90 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.25 వద్ద నిలిచింది.

    ‘కొవిడ్‌ రోగులు ఎక్కువగా శ్రమించొద్దు’

    దేశంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలపై కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారు రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదని తెలిపారు. దీనివల్ల కార్డియాక్‌ అరెస్ట్‌ ముప్పు నుంచి బయటపడొచ్చని సూచించారు. ఈ మేరకు ICMR అధ్యయనం పేర్కొందని తెలిపారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారు ఒత్తిడితో కూడిన పనులు, పరిగెత్తడం, కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలని అని మాండవీయ సూచించారు.

    రషీద్‌కు రూ.10 కోట్లు రివార్డు.. రతన్ టాటా క్లారిటీ

    అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్‌కు ఖాన్‌కు పారిశ్రామికవేత్త రతన్ టాటా రూ.10 కోట్లు రివార్డు ప్రకటించారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై టాటా స్పందిస్తూ ట్వీట్ చేశారు. తాను ఏ క్రికెటర్ రివార్డు ప్రకటించలేదన్నారు.ఇలాంటి ఫార్వార్డ్ మెసేజ్‌లను నమ్మెద్దన్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ భారత జెండా పట్టుకుని కన్పించాడు. దీంతో అతడికి ఐసీపీ రూ.55 లక్షలు జరిమాన విధించిందని వార్తలు వైరల్ అయింది. ఇది చూసిన రతన్ టాటా రషీద్‌కు రూ.10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించారని వార్తలు వైరల్ అయ్యాయి.

    ఎస్‌బీఐ అంబాసిడర్‌గా ధోని

    దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. క్లిష్టపరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటూ తెలివైన నిర్ణయాలను తీసుకోవడంలో ధోనీ ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. ఈ లక్షణాలు తమ మార్కెటింగ్‌కు, కస్టమర్లకు మరింత కనెక్ట్ చేస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. నైతికతకు పరిపూర్ణ రూపంగా ధోనితో భాగస్వామ్యం నిలుస్తుందని వెల్లడించింది.

    బస్సు రెడీగా ఉంది కేటీఆర్ సిద్ధమా?: రేవంత్ రెడ్డి

    కర్ణాటక డిప్యూటి సీఎం డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తిప్పి కొట్టారు. ‘కర్ణాటకలో హామీలన్నీ అమలు అవుతున్నాయి. వాటిపై కేసీఆర్, కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ విసిరిన సవాల్‌కు కేసీఆర్, కేటీఆర్ తోక ముడిచారు. బస్సు రెడీగా ఉంది, ప్రగతి భవన్ రావాలా, ఫాం హౌస్‌కు రమ్మంటావా.. బస్సులో నేరుగా కాళేశ్వరం వెళ్లి చూద్దాం.. అక్కడి నుండి కర్ణాటకకు వెళ్దాం, సిద్ధమా? అని ప్రశ్నించారు.

    రియల్లీ గ్రేట్ శీతల్… నవ్వొక పాఠం!

    పారా ఆసియా క్రీడల్లో శీతల్ దేవి అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. రెండు చేతులు లేని శీతల్ ఆర్చరీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, ఓ రజతం అందించింది. ఆమె టాలెంట్‌కు ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా.. శీతల్‌కు ప్రత్యేక కారును బహుకరిస్తానని పేర్కొన్నాడు. ఈక్రమంలో శీతల్ జీవిత కథ చెప్పే ఓ చిన్న వీడియోను పోస్ట్ చేశారు. ఆమె జీవితం ప్రతిఒక్కరికి పాఠంగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. https://x.com/anandmahindra/status/1718268342132199711?s=20

    ఉల్లి ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం

    ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి కనీస ఎగుమతి ధరలను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది. డిసెంబర్ 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. దేశంలో ఉల్లి అందుబాటులో ఉంచేందుకు అలాగే ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

    ఉల్లి ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం

    ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి కనీస ఎగుమతి ధరలను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది. డిసెంబర్ 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. దేశంలో ఉల్లి అందుబాటులో ఉంచేందుకు అలాగే ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

    నిలిచిన రైలు.. ప్రయాణికులు ఆగ్రహం

    సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 4 గంటలుగా రైలు నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో ధర్మవరం-నర్సాపూర్ ఎక్క్‌ప్రెస్ పట్టాలపై నిలిచిపోయింది. రైలు 4 గంటలకు పైగా నిలిచిపోయినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారులపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఒకే ఇంట్లో ఏడుగురి మృతి

    గుజరాత్‌ దారుణ ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతిచెంది ఉన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఆర్థిక లావాదేవీల కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏడుగురు విషం తాగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో విషపదార్థంతో కూడిన ఓ సీసాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.