• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇంట్లోకి చొరబడి యువతిపై కాల్పులు

    రాజధాని ఢిల్లీలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కొందరు దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడి తుపాకీతో కాల్పులు జరిపారు. జైత్‌పుర్ ప్రాంతంలో 24 ఏళ్ల యువతి నివాసముంటోంది. రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు యువతి ఇంట్లోకి చొరబటి ఆమెపై వరస కాల్పులు జరిపారు. దీంతో సదరు యువతి ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచింది. ఇరుగు పోరుగు వారు తుపాకీ శబ్ధం విని యువతి ఇంటికి వచ్చారు. హత్య చేసి పారిపోతున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు తప్పించుకున్నారు.

    బ్యాంకు ఉద్యోగులకు త్వరలో గుడ్‌న్యూస్

    బ్యాంకు ఉద్యోగులు తర్వలో గుడ్‌న్యూస్ వినబోతున్నారు. వారానికి ఐదు రోజుల పని విధానం త్వరలో అమలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రవేటు రంగ బ్యాంకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే ఉద్యోగులకు జీతాల పెంపునకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఇటీవల కాలంలో బ్యాంకు లాభాలు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులు మెరుగైన వేతనం కోసం ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. దీనిపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

    త్వరలో దేశ వ్యాప్తంగా BSNL 4జీ సేవలు

    BSNL 4జీ సేవలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని bsnl అధికారులు తెలిపారు. ముందుగా పంజాబ్ నుంచి ఈ సేవలు ప్రారంభిస్తామని వెల్లడించారు. bsnl 4జీ సేవలకు సంబంధించి ఇప్పటికే 200 ప్రదేశాల్లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా పంజాబ్‌లో ప్రారంభించి దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని స్పష్టం చేశారు. 2024 జూన్ నాటికి దేశ వ్యాప్తంగా bsnl 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.

    ముకేశ్‌ అంబానీకి బెదిరింపులు

    రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపింది. అంబానీ కంపెనీకి చెందిన ఓ ఈ-మొయిల్‌ ఐడీకి గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రూ.20 కోట్లు ఇవ్వాలని లేదంటే కాల్చి చంపేస్తామని ఆ మెయిల్‌లో నిందితుడు హెచ్చరించినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముంబయి పోలీసులు వివరించారు. కాగా గతంలోనూ పలుమార్లు అంబానీకి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.

    ఏపీ ఓటర్లలో మహిళలదే పైచేయి

    ఏపీలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. మొత్తం 4,02,21,450 ఓటర్లలో అత్యధికంగా 2,03,85,851 మంది మహిళలు ఉన్నట్లు ప్రకటించారు. పురుష ఓటర్ల సంఖ్య 1,98,31,791గా ఉన్నట్లు తెలిపారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 5,54,060 మంది అధికంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అటు సర్వీసు ఓటర్లు 68,158 మంది ఉంటే థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 3,808 మంది ఉన్నారని వివరించారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అర్హులైన ఓటర్లందరినీ నమోదు … Read more

    నష్టాలకు బ్రేక్‌ పంజుకున్న స్టాక్ మార్కెట్లు

    గత ఆరు రోజుల నష్టాలను చవిచూస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌‌లు నేడు బలంగా పుంజుకున్నాయి. ఉదయం నుంచి లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఈ రోజంతా అదే జోరును కొనసాగింది. దేశియంగా కార్పొరేట్‌ ఫలితాలు సానుకూలంగా ఉండటం కలిసొచ్చింది. ఉదయం సెన్సెక్స్‌ 63,559.32 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. చివరకు 634.65 పాయింట్ల లాభంతో 63,782.80 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 18,928.75 దగ్గర ప్రారంభమై 190 పాయింట్లు లాభపడి 19,047.25 దగ్గర ముగిసింది.

    కాంగ్రెస్‌పై మోదీ వ్యంగ్యాస్త్రాలు

    ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్‌ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాలం చెల్లిన ఫోన్లు పని చేయవు వాటిని ఎన్ని సార్లు స్విచ్‌ఆన్ చేసినా బటన్లు నొక్కిన ఫలితం ఉండదు. కాంగ్రెస్‌ది కూడా ఇప్పడు అలాంటి పరిస్థితే. 2014లో కాలం చెల్లిన ఫోన్లను వదిలించుకున్నట్లు కాంగ్రెస్‌ను వదిలించుకున్నారు. ఈ దేశానికి సాయం చేసే గొప్ప అవకాశాన్ని మాకు కల్పించారు’ అని మోదీ చెప్పుకొచ్చారు.

    డబ్బు ఆశ చూపి వృద్ధ దంపతులకు రూ.4 కోట్లు టోకరా!

    ఓ వృద్ద దంపతుల వద్ద సైబర్‌ నేరగాళ్లు కోట్లు దోచుకున్నారు. ముంబయిలో వృద్ధ జంట నివసిస్తోంది. ఈ క్రమంలో 71 ఏళ్ల వృద్ధురాలికి ఓ రోజు గుర్తు తెలియని మహిళ నుంచి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తన భర్త పీఎఫ్‌ ఖాతాలో కంపెనీ రూ.11 కోట్లు డిపాజిట్ చేసిందని నమ్మబలికింది. ఆ డబ్బు అందుకోవాలంటే ట్యాక్స్ కింది రూ.4.35 కోట్లు జమ చేయాలని కోరింది. ఆ వృద్ధ దంపతులు డబ్బులు జమ చేసిన తర్వాత నుంచి సదరు మహిళ ఫోన్ స్విచ్‌‌ఆఫ్ వచ్చింది. … Read more

    లోన్ రికవరీకి నిబంధనలు కఠినతరం

    రుణ బకాయిల వసూలుకు సంబంధించి RBI నిబంధనలు కఠినతరం చేసింది. రుణగ్రహితలకు ఆయా సంస్థలు ఉదయం 8 లోపు, సాయంత్రం 7 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్ చేయకూడదని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక సేవల్లో ఔట్‌ సోర్సింగ్‌, ప్రవర్తనా నియమావళికి సంబంధించి ముసాయిదాను RBI విడుదల చేసింది. డైరెక్ట్‌ సేల్స్‌ ఏజెంట్లు, డైరెక్ట్‌ మార్కెటింగ్‌ ఏజెంట్లు, రికవరీ ఏజెంట్లకు తాము తీసుకువచ్చిన ప్రవర్తనా నియామావళిని అమలు చేయాలని పేర్కొంది. కస్టమర్లతో మాట్లాడే విషయంలో ఏజెంట్లకు తగిన శిక్షణ ఇవ్వాలని సూచించింది. © ANI … Read more

    ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌

    మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్ ద్వారా చిన్న వీడియోను రికార్డ్ చేసుకుని ఇతరులకు పంపవచ్చు. . ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత యూజర్లు డిఫాల్ట్ ప్రొఫైల్ ఫోటోను లూపింగ్ వీడియోతో నోట్స్‌లో అప్‌డేట్ చేయగలుగుతారు. నోట్‌ని క్రియేట్ చేయడం ప్రారంభించినప్పుడు ప్రొఫైల్ ఫోటో పక్కన కెమెరా సింబల్ ఉంటుంది. దీని నుంచి వీడియో రికార్డ్ చేసి నోట్స్‌లో పోస్ట్ చేయవచ్చు.