• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేవీ మాజీ అధికారులుకు మరణశిక్ష!

    భారత నౌకాదళ మాజీ అధికారులుకు ఖతార్‌ కోర్టు మరణశిక్ష విధించింది. గూఢచర్యం ఆరోపణలపై 8 మందికి శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఈ వార్త తమనెంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించింది. చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాల కోసం అన్వేషిస్తున్నామని చెప్పింది. ఈ తీర్పుకు సంబంధించిన విషయాన్ని ఖతర్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

    భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయమే భారీ పతనంతో మొదలై అదే ట్రెండ్ కనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు మార్కెట్ల పతనానికి దారితీశాయి. ఉదయం సెన్సెక్స్‌ 63,774.16 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. చివరకు 900.91 పాయింట్ల నష్టంతో 63,148.15 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,027.25 దగ్గర ప్రారంభమై 259.20 పాయింట్లు నష్టపోయి 18,862.95 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.23 వద్ద నిలిచింది.

    18 సార్లు ఓడినా.. మళ్లీ నామినేషన్

    మూడు దశాబ్ధాలుగా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనా అతను మాత్రం నిరుత్సాహ పడలేదు. ఎప్పటికైనా గెలుస్తామన్న నమ్మకంతో ఆయన మరోసారి పోటీకి సై అంటున్నాడు. ఆయనే మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ వాసి మరమానంద్ తోలాని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల తన నామినేషన్ సమర్పించారు. ఆయన గత 35 ఏళ్లుగా అసెంబ్లీ, మేయర్, లోక్‌సభ, ఇలా పలు ఎన్నికల్లో 18 పోటీ చేసి అన్ని సార్లు డిపాజిట్‌ కోల్పోయాడు. తాజాగా నవంబరు 17న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన మరోసారి నామినేషన్ … Read more

    కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

    కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనడంతో 12 మంది దుర్మరణం చెందారు. బాధితులు ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండల వాసులుగా తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి పొగమంచు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

    రాజస్థాన్‌లో దిగ్భ్రాంతికర ఘటన

    రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని ట్రాక్టర్‌తో ఎనిమిది సార్లు తొక్కించి చంపారు. బయానా ప్రాంతానికి చెందిన బహదూర్‌ సింగ్‌, అతర్‌ సింగ్‌ కుటుంబాల మధ్య ఓ స్థలం విషయంలో వివాదం ఉంది. బహదూర్‌ కుటుంబ సభ్యులు ఆ స్థలాన్ని దున్నేందుకు ట్రాక్టర్‌తో వచ్చారు. విషయం తెలిసి అతర్‌ సింగ్‌ కుటుంబ సభ్యులూ అక్కడకు చేరుకోవడంతో ఘర్షణ మొదలైంది. ఈ గొడవలో అతర్‌ సింగ్‌ కుటుంబానికి చెందిన నిర్పత్‌ నిరసనగా నేలపై పడుకోగా, బహదూర్‌ కుటుంబానికి చెందిన వ్యక్తి ట్రాక్టర్‌తో … Read more

    మళ్లీ పెరిగిన పసిడి ధరలు

    పసిడి ధరలు ఇవాళ కూడా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100, రూ.110 చొప్పున పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.56,800 చేరింది. అటు ముంబయిలో రూ.56,650, చెన్నైలో రూ.56,850, కోల్‌కతాలో రూ.56,650, బెంగళూరులో రూ.56,650గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650కు చేరింది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.78,000 పలుకుతోంది.

    సికింద్రాబాద్‌లో భారీ అగ్రి ప్రమాదం

    సికింద్రాబాద్‌లో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. క్లాక్‌ టవర్‌ సమీపంలో ఉన్న నవకేతన్‌ కాంప్లెక్స్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు ఐదో అంతస్తు వరకు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నవకేతన్‌ కాంప్లెక్స్‌ ప్రాంతంలో పొగ దట్టంగా అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడున్న ప్రజలు అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పింది.

    టాప్ 10 బెస్ట్ లాప్‌టాప్ కూలింగ్ ప్యాడ్స్ ఇవే!

    ల్యాప్ కూలింగ్ ప్యాడ్స్ అనేవి ల్యాప్‌టాప్‌ల జీవితకాలాన్ని పెంపొందించడంలో సాయపడుతాయి. ల్యాపటాప్స్ ఆపరేటింగ్ సమయంలో ఎక్కువగా హీట్ జనరేట్ అవుతుంటుంది. ఎక్కువసేపు పనిచేసినప్పుడు హీట్ జనరేషన్ అధికంగా ఉంటుంది. దీనివల్ల ల్యాప్‌టాప్‌లు సడెన్‌గా హ్యాంగ్ అవడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలంలో అధిక వేడిమి వల్ల ల్యాప్‌టాప్‌లు చెడిపోయే అవకాశం ఉంది. అందే ఇక్కడ కొన్ని టాప్‌ రేటెడ్ కూలింగ్ ప్యాడ్స్ సూచించడం జరిగింది. మీ అవసరాన్ని బట్టి ఒకదాన్ని ఎంచుకుని కొనుగోలు చేసేందుకు YouSay Webపై క్లిక్ చేయండి.

    కెనడా వీసా సేవలు భారత్ పునరుద్ధరణ

    కెనడా పౌరులకు వీసా సేవలను భారత్ పునరుద్ధరించింది. ఈ మేరకు ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్‌ వీసా, కాన్ఫరెన్స్‌ వీసాలను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల కెనడాతో దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తడంతో భారత్ కెనడా పౌరుల వీసా సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే..

    దిమ్మదిరిగే ఫీచర్లతో రెడ్‌మీ 14..!

    భారత మార్కెట్‌లో టాప్ సెల్లింగ్ బ్రాండ్‌లలో రెడ్‌మీ ఒకటి. చైనీస్ కంపెనీ షావోమీ(Xiaomi) ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ మొబైల్ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఇటీవలే పలు మోడళ్లను రిలీజ్ చేసిన షావోమీ.. అక్టోబర్ 26న Xiaomi 14 సిరీస్‌ని లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ గ్యాడ్జెట్‌లో తొలిసారి సొంత ఆపరేటింగ్ సిస్టం HyperOS తెస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా తీసుకొస్తుందట. మరి ఈ ఫీచర్లను చూసేందుకు YouSay Webపై క్లిక్ చేయండి.