• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గబ్బిలాల్లో నిఫా వైరస్?

    కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది. గబ్బిలాల్లో నిఫా వైరస్ ఉండే అవకాశం ఉందని చెప్పింది. గబ్బిలాల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా icmr ఈ సమాచారం అందించినట్లు పేర్కొంది. రాష్రంలో ఆరోగ్య వ్యవస్థను సాధారణ ప్రజలను అప్రమత్తం చేసే ఉద్దేశంలో ఈ సమాచారం వెల్లడించినట్లు పేర్కొంది. నిఫా వైరస్ మరణాల రేటును 70-90 శాతం నుంచి 33 శాతానికి పరిమితం చేయగలిగామని ప్రభుత్వం ఓ నివేదికలో పేర్కొంది.

    నేషనల్ ఎన్నికల ఐకాన్‌గా బాలీవుడ్ నటుడు

    కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా నేషనల్ ఎన్నికల ఐకాన్‌గా బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావును నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం దిల్లీలోని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్‌ ఆయన్ను అధికారికంగా నియమించనున్నారు. రాజ్‌కుమార్‌ “న్యూటన్” చిత్రంలో ఎన్నికలు నిర్వహించే ప్రభుత్వ అధికారి పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. అందుకు ఆయనకు జాతీయ అవార్డు కూడా లభించింది. ఈ నేపథ్యంలోనే రాజ్‌కుమార్‌ను నేషనల్ ఎన్నికల ఐకాన్‌గా ఈసీ నియమించింది.

    పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్‌

    దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్‌ అనే పదాన్ని చేర్చాలని NCERT పేర్కొంది. ఈ ప్రతిపాదనను అంతటా అమలు చేయాలని వెల్లడించింది. ఈ మేరకు జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులు.. పురాతన చరిత్ర, ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని NCERT వెల్లడించింది.

    వందశాతం నా నైపుణ్యాన్ని ఎవరూ చూడలేదు: గిల్

    టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు చేసిన ప్రదర్శన 90 శాతమేనని ఇంకా వందశాతం ఎవరూ చడలేదన్నాడు. ‘మన్ముందు మరింత నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తా? ఇది కేవలం భారీ స్కోరు గురించే కాకుండా నా ఆటతీరు వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ఏ మ్యాచ్‌లోనైనా మంచి ఇన్నింగ్స్ ఆడితే దాని వల్ల జట్టుకు కలిగే ఉపయోగం ఏంటనేది కూడా ఆలోచించాలి. ఆ తర్వాత ఫలితంపై ప్రభావం తప్పకుండా ఉంటుంది’. అని గిల్ చెప్పుకొచ్చాడు.

    భారత్‌లోకి 2,000 కిలోల బంగారం స్మగ్లింగ్‌

    అక్రమంగా భారత్‌లోకి తీసుకువచ్చిన రూ.2,000 కిలోల బంగారాన్ని సీజ్ చెసినట్లు CBIC వెల్లడించింది. ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఇంత మొత్తంలో పట్టుబడిందని పేర్కొంది. గత వార్షిక ప్రాతిపదికతో పోలిస్తే ఇది 43 శాతం పెరిగినట్లు పేర్కొంది. క్రితం ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.3,800 కిలోల అక్రమ బంగారం పట్టుబడ్డట్లు వెల్లడించింది. అత్యధికంగా మయన్మార్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల నుంచి భారత్‌లోకి బంగారాన్ని దుండగులు స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు పేర్కొంది.

    ఉబర్ డ్రైవర్‌గా గూగుల్ మాజీ ఉద్యోగి

    గూగుల్ మాజీ ఉద్యోగి ఉబర్ డ్రైవర్‌గా మారాడు. బెంగళూరుకు చెందిన రాఘవ దువా ఉబర్ బైక్ రైడ్‌ని బుక్ చేసుకున్నాడు. ఆ సమయంలో తన బైక్ డ్రైవర్ గురించి ఆసక్తికర విషయాలను ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నాడు. ‘గూగుల్‌లో పనిచేసిన మాజీ ఉద్యోగే నా ఉబర్ డ్రైవర్ హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ డ్రైవర్ బెంగళూరు అంతటా పర్యటించాలనుకున్నాడు. అందులో భాగంగానే ఇలా ఉబర్ డ్రైవర్‌గా మారాడు. అని రాఘవ్ రాసుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

    దెయ్యం వదిలిస్తానని చెప్పి.. చివరికీ!

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఓ తాంత్రికుడి చర్యలకు మహిళ బలైంది. పత్వారియా ప్రాంతానికి చెందిన ప్రియా సక్సేనా కొన్నిరోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. ఇటీవలే ఆమెకు ఓ తాంత్రికుడు పరిచయమయ్యాడు. ప్రియకు దెయ్యం పట్టిందని, ఆ దెయ్యాన్ని వదిలిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో హోమం నిర్వహించి ఆమెను చిత్రహింసలు పెట్టాడు. ప్రియా మెడపై కాలు వేసి తొక్కాడు. అనంతరం నీటి పైపుతో దారుణంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణం కోల్పోయింది.

    సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై భార్య పోటీ

    రాజస్థాన్‌లో ఓ మహిళ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తన భర్తపైనే పోటీకి దిగింది. దంత రామ్‌గర్‌ నియోజకవర్గంలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్‌ పోటీలోకి దిగనుండగా, అతని భార్య రీటా చౌదరి మాత్రం జేజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. తన మనస్సాక్షి చెప్పిన విధంగానే నడుచుకుంటానని అందుకే జేజేపీ పార్టీలో చేరానని ఆమె చెప్పారు. తన నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారని, ఈ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

    లుంగీ డ్యాన్స్‌కు అఫ్గాన్ క్రికెటర్ల స్టెప్పులు

    పాకిస్థాన్‌పై విజయం అనంతరం అఫ్గానిస్థాన్ క్రికెటర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. స్టేడియం నుంచి బస్సులో తమ హోటల్ గదిలోకి వెళ్లేంత వరకు డ్యాన్స్ వేస్తూ సందడి చేశారు. చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలోని లుంగి డ్యాన్స్ పాటకు స్టెప్పులు వేశారు. రషిద్ ఖాన్‌తో పాటు ఇతర ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తూ ఆనందించారు. కాగా నిన్న పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ 8 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. https://x.com/CricCrazyJohns/status/1716631803585561031?s=20

    తీవ్ర తుపాన్‌గా బలపడిన ‘హమూన్’

    బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపాన్‌గా మారినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపాన్‌కు ‘హమూన్‌’గా పేరు పెట్టారు. ఈ పేరును ఇరాన్ సూచించింది. తీవ్ర తుపాన్గా మారిన హమూన్.. ఈశాన్య దిశగా కదులుతోంది. ఒడిశాలోని పారాదీప్కు ఆగ్నేయంగా, పశ్చిమ బెంగాల్లోని దక్షిణ-ఆగ్నేయంగా 270 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. రేపు మధ్యాహ్నం బంగ్లాదేశ్ చిట్టగాంగ్, ఖేప్ పురా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుపాన్ కారణంగా భారత్‌లో ఏడు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.