• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జనవరి నెల కోటా టికెట్లు విడుదల

    జనవరి నెల కోటాకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను టీటీడీ విడుదల చేసింది. టికెట్లను టీటీడీ వెబ్ సైట్లో మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది. జనవరి నెలకు సంబంధించి నిన్న శ్రీవాణి భక్తుల దర్శనం, వసతి కోటా టికెట్లు విడుదల చేసింది. అటు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల వరకు సమయం పడుతోంది. సోమవారం స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.12 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    అందుకే ఓడిపోయాం: బాబర్ అజామ్

    అఫ్గానిస్థాన్‌పై ఓటమిపై పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్ స్పందించాడు. ‘ఈ ఓటమి మమ్మల్ని మరింత బాధపెట్టింది. మంచి టార్గెట్ అఫ్గాన్ ముందు ఉంచినా కాపాడుకోలేకపోయాం. స్పిన్నర్లు అనుకున్నంత రాణించలేకపోయారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయాం. అఫ్గాన్ ప్లేయర్లు బాగా ఆడారు. నాణ్యమైన ఆటతీరు కనబరిచారు. అందుకే వారు గెలిచారు. ఈ మ్యాచ్ నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. తర్వాతి మ్యాచ్‌ల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం’ అని చెప్పాడు.

    తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

    తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలై సమీపంలోని సెంగం పక్రిపాళయం సెంగం బైపాస్ రోడ్డు వద్ద టాటా సూమోను లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

    మొసలిని భుజాలపై ఎత్తుకొన్న యువకుడు

    ఓ యువకుడు మొసలిని భుజాలపై మోస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాజ్‌వారా అనే గ్రామంలోని ఓ చెరువులో మొసలి కనిపించింది. దీంతో గామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇద్దరు యువకుల సహాయంతో అధికారులు మొసలిని తాళ్లతో బంధించారు. మొసలిని అమాంతం తన భుజాలపై ఎత్తుకున్న ఓ యువకుడు 300 మీటర్ల దూరంలో ఉన్న అటవీశాఖ వాహనం వద్దకు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    మిజోరంలో ముగిసిన నామినేషన్ల పర్వం

    మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు. మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు తెలిపారు. ఐదు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో దించాయని చప్పారు. అలాగే 27 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మిజోరం ఎన్నికల పోలింగ్ నవంబర్ 7న జరగనుంది.

    రెండు రైళ్లు ఢీకొని 20 మంది మృతి

    బంగ్లాదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో ఉన్న రైలును గూడ్స్ రైలు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కొల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ధ్వంసమైన కోచ్‌లను తొలగించేందుకు క్రేన్లను ఉపయోగిస్తున్నారు. .

    రియల్‌మీలో టాప్ 7 స్మార్ట్ ఫోన్లు ఇవే!

    చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీకి ఇండియాలో రెడ్‌మీ తర్వాత ఆ స్థాయిలో మంచి గుడ్ విల్ ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చే స్మార్ట్ ఫోన్లకు ఇండియన్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ బడ్జెట్ నుంచి ప్రీమియం బడ్జెట్‌ వరకు ఫోన్లను రియల్‌మీ అందిస్తోంది. వాటిలో బెస్ట్ రేటింగ్ కలిగి, ఎక్కువ అమ్ముడు పోతున్న రియల్‌మీ ఫొన్లను మీకు అందిస్తున్నాం. వాటిలో మీకు నచ్చిన ఫోన్‌ను ఎంపిక చేసుకునేందుకు YouSay Webపై క్లిక్ చేసి కొనుగోలు చేసుకోండి.

    రిలయన్స్ చేతికి డిస్నీ?

    ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ డిస్నీని రిలయన్స్‌ కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 10 బిలియన్‌ డాలర్లకు విక్రయించాలని డిస్నీ భావిస్తుంది..అయితే రిలయన్స్‌ 7, 8 బిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు సుముఖంగా ఉందని సమాచారం. వచ్చే నెల దీనిపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రిలయన్స్‌ మీడియా యూనిట్లు సైతం ఇందులో విలీనం అయ్యే అవకాశం ఉందని తెలిసింది. కొంత నగదు, షేర్ల బదిలీ రూపంలో ఈ డీల్‌ జరిగే అవకాశం ఉందని సమాచారం.

    వీధి కుక్కల దాడితో వ్యాపారవేత్త మృతి

    ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్‌ బక్రీ టీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరాగ్‌ దేశాయ్‌(49) కన్నుమూశారు. మెదడులో తీవ్ర రక్తస్రావం వల్ల ఆదివారం ఆయన మరణించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. గతవారం ఇంటికి సమీపంలో వీధి కుక్కలు దాడి చేయడంతో పరాగ్‌ దేశాయ్‌ కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ పరాగ్‌ మరణించారు. పరాగ్‌ మృతిపై రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

    ఢిల్లీలో స్విట్జర్లాండ్‌ మహిళ హత్య

    ఢిల్లీలో స్విట్జర్లాండ్‌ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తిలక్ నగర్‌లో 30 ఏళ్ల నినా బెర్గర్ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. సదరు మహిళను ప్లాన్ ప్రకారం ఇండియాకు రప్పించి ప్రియుడు గురుప్రత్ సింగ్ హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని ఓ కవర్‌లో చుట్టి రోడ్డు పక్కన పడేశాడు. సీసీటీవీ ఫుటేజ్‌, కార్ నెంబర్‌ ఆధారంగా నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. గుర్‌ప్రీత్‌ మెుబైల్‌లో డజన్ల కొద్దీ మహిళల ఫోటోలు, ఫోన్ నెంబర్లు కనుగొన్నారు. మానవ అక్రమ రవాణా కోణంలో … Read more