• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాదయాత్రలో రాహుల్ రన్నింగ్

    తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కాసేపు పరుగెత్తి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రేవంత్ రెడ్డి కూడా రాహుల్‌తో పాటు కలిసి పరిగెత్తే ప్రయత్నం చేశారు. కర్ణాటకలోనూ రాహుల్ గాంధీ ఈ విధమైన ఫిట్‌నెస్ ఫీట్లను నాయకులతో కలిసి చేశారు. పుష్ అప్స్ తీయడం, పరుగెత్తడం వంటివాటితో నాయకులను ఉత్తేజపరుస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది. వీడియో కోసం Watch On గుర్తుపై క్లిక్ చేయండి. Out for a marathon, but let's … Read more

    టేకాఫ్‌ అవుతుండగా విమానానికి మంటలు

    బెంగళూరులో ఓ ఇండిగో విమానంలో టేకాఫ్‌ అవుతుండగా మంటలు చెలరేగాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. విమానం టేకాఫ్ అయ్యే కొద్ది క్షణాల ముందు భారీ శబ్దం వినిపించదని, ఆ తర్వాత ఓ ఇంజిన్‌ ఫెయిలైనట్లు గుర్తించామని చెబుతున్నారు. మంటలు అంటుకున్నట్లు గుర్తించి వెంటనే విమానాన్ని ఆపివేశారు. దీనిపై DGCA సమగ్ర దర్యాప్తు చేయనుంది. Just saw : – IndiGo plane VT-IFM caught fire while it was taking off yesterday – … Read more

    అడ్డుపడ్డారని కారు ఎక్కించాడు

    దిల్లీలో ముగ్గురు వ్యక్తులపైకి యువకుడు కారు ఎక్కించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్‌ 26న నగరానికి చెందిన నితిన్‌ మాన్‌ కారుకు అడ్డం వచ్చాడని వాహనదారుడితో వాగ్వాదానికి దిగాడు. అతడి తరఫున మాట్లాడేందుకు వచ్చిన వారితో గొడవపడ్డాడు. ఆవేశంలో కారును ముగ్గురుపైకి ఎక్కించి పరారయ్యాడు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు నితిన్‌ను అరెస్ట్‌ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. #WATCH | Delhi: A car ran over people in Alipur area on Oct 26 following an argument … Read more

    భార్యను కారుతో తొక్కించిన నిర్మాత

    కారులో వేరే మహిళతో ఉండగా చూసిందని తన భార్యనే మట్టుబెట్టాలని అనుకున్నాడో సినీ నిర్మాత. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం నిర్మాత కమల్ కిశోర్ మిశ్రా తన కారులో వేరే మహిళతో ఉన్నారు. ఈ సమయంలో భర్త కోసం భార్య వెతుక్కుంటూ వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది తీవ్రం కావడంతో భార్య నుంచి తప్పించుకునేందుకు కారుతో ఆమెను ఢీకొట్టాడు. కిందపడినా కూడా కనికరించకుండా ఆమె కాళ్లపై నుంచి కారును పోనిచ్చాడు. దీంతో బాధితురాలకి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాత పరారీలో ఉన్నాడు. #WATCH … Read more

    కోయంబత్తూరులో హై అలర్ట్

    కారు బాంబు ఎఫెక్ట్‌తో కోయంబత్తూరులో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు మోహరించి భద్రత పర్యవేక్షిస్తున్నాయి. ఎన్ఐఏ అధికారులు ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు చేరుకున్నారు. కాగా కోయంబత్తూరులోని సంగమేశ్వర ఆలయం ముందు కారు విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో కారు రెండు ముక్కలు కాగా, ఒకరు మృతి చెందారు. ఈ పేలుడులో మృతి చెందిన వ్యక్తిని జమేషా ముబీన్‌గా పోలీసులు గుర్తించారు. ముబీన్ ఇంట్లో సోదాలు జరుపి పలు అనుమానాస్పద వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం … Read more

    పాట పాడిన ముఖ్యమంత్రి

    కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను మధ్యప్రదేశ్ సీఎం ఉల్లాసపరిచారు. తన ఇంటికి ఆహ్వానించి దీపావళి సంబరాలు జరుపుకొన్నారు. ఈ వేడుకలో సుమారు 300కు పైగా చిన్నారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారికి సహంపక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రే స్వయంగా కొందరు చిన్నారులకు తినిపించారు. అనంతరం కచేరిలో పాల్గొని పాటలు పాడారు. ఈ వీడియోను ముఖ్యమంత్రి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. मेरे बच्चों, यदि हम हताश होकर बैठेंगे, यह तो जिंदगी बोझ … Read more

    ఆకట్టుకున్న డ్రోన్ విన్యాసాలు

    గాంధీనగర్‌లో జరిగిన డిఫెన్స్ ఎక్స్‌పో 2022లో డ్రోన్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. డ్రోన్‌లు గాలిలో ఎగురుతూ చేసిన విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. డ్రోన్ల ద్వారా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్, భారత సైన్యం, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్ చిత్రాలను నిర్వాహకులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ.. హిందూ మహాసముద్రం ప్రాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ డ్రైవింగ్ ఇంజిన్‌గా సముచిత స్థానం పొందాలని ఆకాంక్షించారు. Drone Show #Defenceexpo2022 #DefenceExpo pic.twitter.com/529oo6owhl — Dr. Ashok … Read more

    ఆర్మీడాగ్ ‘జూమ్’కు ఘన నివాళి

    ముష్కర మూకలను పట్టించే క్రమంలో బుల్లెట్ దెబ్బలు తిని వీరమరణం పొందిన ఆర్మీ శునకం ‘జూమ్’కి సైనిక పటాలం ఘనంగా నివాళులర్పించింది. జమ్మూలో ‘29 ఆర్మీ డాగ్ యూనిట్’ వీర శునకానికి శ్రద్ధాంజలి ఘటించింది. శునకాలు కాసేపు మౌనం పాటించాయి. సైనికాధికారులు వాటిని గైడ్ చేస్తూ ‘జూమ్’కి సెల్యూట్ చేశారు. శునకాలతో సెల్యూట్ చేయించారు. ఈ నెల 9న అనంత్‌నాగ్‌లో ముష్కరుల వేటలో సైనిక శునకం ‘జూమ్’ శరీరానికి రెండు బుల్లెట్లు తగిలాయి. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న ప్రాణాలు విడిచింది. #WATCH … Read more

    రాహుల్ గాంధీ ‘పుష్ అప్’ ఛాలెంజ్

    రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ఉత్సాహంగా సాగుతోంది. ఈ యాత్రలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ‘పుష్ అప్’ ఛాలెంజ్‌లో పాల్గొని రాహుల్ గాంధీ మెప్పించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, శివకుమార్, స్థానిక యువకుడితో కలిసి రాహుల్ ఈ పోటీలో పాల్గొన్నారు. ఇది నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ ‘రాహుల్ ఒక్కరే సరైన పుష్ అప్స్ తీశారు. మిగతావారు సగం సగం’ అని కామెంట్ చేశారు. కాగా, … Read more

    గువాహతిలో వరద భీభత్సం

    అస్సాం రాజధాని గువాహతిలో వరద భీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడడంతో గువాహతిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రుక్మిణీగావ్, హాతీగావ్‌ ప్రాంతాల్లో మనుషులు మునిగిపోయేంత మేర వరద నీరు నిలిచింది. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నారు. వీడియో కోసం [వాచ్ ఆన్](url) బటన్‌పై నొక్కండి. #WATCH | Assam: Several areas in Guwahati city face severe waterlogging and flood-like situation due to heavy rainfall … Read more