• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మోదీ యుగం స్వర్ణయుగం’

    సాంస్కృతిక పునరుజ్జీవనానికి మోదీ యుగం స్వర్ణయుగం లాంటిదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్‌లో తెలిపారు. కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం, కాశీ విశ్వనాథ్ ఆలయం, ఉజ్జయినీ మహంకాళీ ఆలయాలకు మోదీ హయాంలోనే పునరుజ్జీవనం వచ్చినట్లు సంజయ్ అభిప్రాయపడ్డారు. పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడంలో మోదీ ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. పర్యాటక రంగానికి బీజేపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు.[ వీడియో](url) కోసం వాచ్ ఆన్ బటన్‌పై నొక్కండి A Golden era for Cultural rejuvenation under leadership of Hon'ble PM … Read more

    క్షేమంగానే రైనో; సీఎం

    హల్దీబారీలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన రైనో ఆరోగ్యంగానే ఉన్నట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా డ్రోన్ ద్వారా తీసిన[ వీడియో](url)ను సీఎం పంచుకున్నారు. ఈ మేరకు జంతువులు రోడ్లు దాటేటప్పుడు కాస్త నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులను కోరారు. కాగా ఇటీవల హల్దీబారీ రహదారి వద్ద వేగంగా వెళ్తున్న ట్రక్కును రైనో ఢీకొట్టింది. ఆ తర్వాత అది పడుతూ లేస్తూ అడవిలోకి వెళ్ళిపోయింది. అప్పటినుంచి దాని ఆరోగ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇదే విషయమై సీఎం స్పందించి వీడియో … Read more

    రాజ్‌కోట్‌లో మోదీకి ఘనస్వాగతం

    మూడు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం లభించింది. రాజ్‌కోట్‌ జిల్లాలోని జాంకన్ దోర్నాలో జరిగే బహిరంగ సభకు మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడి ప్రజలు మోదీకి పూలు జల్లి ఘనస్వాగతం పలికారు. దీంతో ముగ్ధుడైన మోదీ అందరికీ అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. #WATCH | Prime Minister Narendra Modi today received a warm welcome at Jamkandorna in Rajkot district, where … Read more

    ఘనంగా వైమానిక దళ వారోత్సవాలు

    భారత వైమానిక దళం ఏర్పడి 90 ఏళ్లు కావడంతో యానివర్సరీ వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. ఏటా అక్టోబర్ 8న ఎయిర్‌ఫోర్స్ డే నిర్వహిస్తారు. దేశ రక్షణలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ది కీలకపాత్ర. శత్రు దేశాలతో యుద్ధంలో పాల్గొనడం, ప్రకృతి వైపరీత్యాలు, అంతర్యుద్ధాల్లో చిక్కుకుపోయిన దేశ పౌరులను రక్షించటం దీని ప్రధాన లక్ష్యాలు. కాగా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వైమానిక దళం భారత్‌దే. కోవిడ్ సమయంలో మిషన్ ఆక్సిజన్ పేరుతో ఆక్సిజన్ కంటైనర్లను ప్రజలకు సరఫరా చేసింది. #WATCH | The 90th-anniversary celebrations of … Read more

    దుర్గ నిమజ్జనంలో అపశృతి.. ఏడుగురు మృతి

    పశ్చిమ బెంగాల్- జలపాయ్‌గురిలో విషాదం నెలకొంది. నిన్న రాత్రి దుర్గ మాత నిమజ్జనం సమయంలో మాల్ నదిలో పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నదిలో పడి గల్లంతయ్యారు. వెంటనే స్పందించిన NDRF సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నదిలో నిమజ్జనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా నదిలో [వరద](url) ఉద్ధృతి పెరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. #WATCH | WB: Flash flood hits Mal River in … Read more

    హీలియం ట్యాంక్‌ పేలి ఒకరు మృతి

    హీలియం ట్యాంక్‌ పేలి ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటుచేసుకుంది. తిరుచ్చిలో రద్దీగా ఉండే మార్కెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మార్కెట్లో హీలియం బలూన్లు అమ్ముతుండగా ప్రమాదం జరిగింది. అయితే హీలియం బలూన్లు అమ్మిన వ్యక్తిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. అందువల్ల ఇది ప్రమాదమా, లేదా కావాలని చేసిందా అని పరిశీలిస్తున్నారు.

    అంబులెన్స్‌ కోసం కాన్వాయ్‌ ఆపిన మోదీ

    ప్రధాని మోదీ తన నిరాడంబరత్వాన్ని నిత్యం చాటే ప్రయత్నం చేస్తుంటారు. ఇవాళ కూడా అలాంటి సంఘటన వెలుగుచూసింది. గుజరాత్‌లో పర్యటనకు వెళ్లిన ప్రధాని రహదారిపై వెళ్తున్నారు. ప్రధాని కాన్వాయ్‌ వస్తుందంటే ఆ దారిలో ట్రాఫిక్‌ అంతా ఆపేసి దారి వదలడం సహజం. కానీ ప్రధాని స్వయంగా ఓ అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు తన కాన్వాయ్‌ను పక్కకు ఆపించారు. అంబులెన్స్‌ వెళ్లిపోయాక తిరిగి తన కాన్వాయ్‌ తీసుకెళ్లారు. అహ్మాదాబాద్‌ నుంచి గాంధీనగర్‌ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. #WATCH | Gujarat: Prime Minister Narendra … Read more

    కశ్మీర్‌లో ఆగిఉన్న బస్సులో 2 సార్లు పేలుళ్లు

    జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఆగి ఉన్న ఖాళీ బస్సులో 8 గంటల్లో రెండు [పేలుళ్లు](url) సంభవించాయి. డొమైల్ చౌక్ పాత బస్టాండ్‌ దగ్గర బస్సులో మొదటిసారి బ్లాస్ట్ జరిగినపుడు ఎవరికీ ఏమి కాలేదని పోలీసులు ప్రకటించారు. రెండో పేలుడు రాత్రి 10.45కు సంభవించగా, ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. పేలుడు తీవ్రతకు బస్సు పైకప్పు దెబ్బతినగా, సమీపంలోని పలు వాహనాల కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇతర ఏజెన్సీల సిబ్బంది ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. #WATCH | J&K: A … Read more

    ‘కండోమ్‌లు కూడా ఇవ్వాలా?’ బిహార్‌ అధికారి వ్యాఖ్యలు

    బిహార్‌ మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ అధికారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అధికారి ఓ బాలిక అడిగన ప్రశ్నకు అనుచిత రీతిలో సమాధానమిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ఓ బాలిక ‘ ప్రభుత్వం ఇన్ని ఉచితంగా ఇస్తోంది కదా! రూ.20-30 ఉండే శానిటరీ నాప్కిన్స్‌ ఇవ్వలేదా?’ అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టడంతో అసహనానికి గురైన అధికారి హర్జోత్‌ కౌర్‌ భమ్రా..తీవ్రంగా స్పందించారు. ‘ఇప్పుడు నాప్కిన్లు, రేపు జీన్స్, ఎల్లుండి కండోమ్‌లు.. అన్నీ మీకు … Read more

    ఢిల్లీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

    ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఢిల్లీలో ఉంటున్న తెలుగు ప్రజలు బతుకమ్మ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో దేశరాజధాని బతుకమ్మ పాటలతో మారుమోగింది.