• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నమీబియా చిరుతలు వచ్చేశాయ్

    నమీబియా నుంచి చిరుతలను తీసుకురావడానికి వెళ్లిన ప్రత్యేక విమానం భారత్‌కు చేరుకుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని భారత వైమానిక దళం స్టేషన్‌లో ఈ విమానం ల్యాండ్ అయింది. ఎనిమిది చీతాలను అక్కడినుంచి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ చీతాలను కునో జాతీయ పార్కుకు తరలించనున్నారు. వీటిని ప్రధాని మోదీ శనివారం అడవిలోకి వదిలిపెడతారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. #WATCH | The special chartered cargo flight, carrying 8 cheetahs from Namibia, landed at the Indian Air Force Station … Read more

    ఇండియాకు రానున్న చిరుతల ఫస్ట్ లుక్

    దేశంలో చిరుత పులుల పునరుద్ధరణకు నమీబియా నుంచి ప్రభుత్వం 8 చిరుత పులులను తీసుకురానుంది. ఈనెల 17వ తేదీన ఇండియా చేరుకోనున్న ఈ పులులను.. మధ్యప్రదేశ్‌లో కునొ నేషనల్ పార్కులో వాటిని ఉంచనున్నారు. అయితే ఆ చిరుతలు ఎలా ఉంటాయో అన్న వీడియోను అధికారులు విడుదల చేశారు. ఆ వీడియోలో చూడడానికి చిరుతలు చాలా గంభీరంగా ఉన్నాయి. చిరుతలు ఎలా ఉన్నాయో చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH | First look of Cheetahs that will be … Read more

    ఘోర ప్రమాదం.. 11మంది మృతి

    జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సజియాన్ నుంచి మండీకి వెళ్లే దారిలో మినీబస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 25మంది గాయాలబారిన పడ్డారు. వీరిని మండీలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సులో పాఠశాల విద్యార్థులున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. 11 die, 25 injured in minibus accident in J-K's Poonch Read @ANI Story | https://t.co/e0eqyEfsWT#accident #Poonch #JammuAndKashmir #raodaccident #busaccident … Read more

    ACPపై దాడి చేసిన ఆందోళనకారులు

    బెంగాల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. కోల్‌కతాలో TMC ప్రభుత్వం అవలంభిస్తున్న అవినీతి చర్యలకు నిరసనగా బీజేపీ నేతలు పాదయాత్ర తలపెట్టగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఆందోళనకారులు ACPని ఒక్కడినే చేసి ఓ పరుగెత్తించి కొట్టారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. మరోవైపు పలువురు కార్యకర్తలు పోలీసుల వాహనానికి నిప్పటించారు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి. #Watch: Kolkata Police’s assistant commissioner attacked during the BJP … Read more

    VIDEO: బ్రిటన్ రాణి భారత్ టూర్

    70ఏళ్ల పాటు బ్రిటన్ రాణిగా సేవలందించిన ఘనత ఎలిజబెత్ 2 సొంతం. ఆమె ఇక లేరు. ఆమె జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉంటాయి. బ్రిటన్ రాణి తొలిసారి 1961లో భారత్ లో పర్యటించారు. దిల్లీలోని ఎర్రకోటను, ఆగ్రాలోని తాజ్ మహల్ ను దర్శించుకున్నారు. 1983లో మరోసారి ఇండియాకు వచ్చారు. 1997లో భారత్ లో పర్యటించినప్పుడు.. అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని ఆమె సందర్శించారు. జలియన్ వాలా బాగ్ మారణకాండలో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించారు.

    వివాదాస్పదంగా మారిన సీఎం సోదరుడి వ్యాఖ్యలు

    జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్ సోదరుడు, దుమ్కా ఎమ్మెల్యే బసంత్ సోరెన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల దుమ్కా నియోజకవర్గంలో ఇద్దరు బాలికలపై హత్యాచారం, నిరసనల వేళ బసంత్ ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో స్థానిక మీడియా డిల్లీ ఎందుకు వెళ్లారని ప్రశ్నించగా..తనకు లోదుస్తులు అయిపోయాయని, వాటిని కొనడానికి ఢిల్లీ వెళ్లానని చెప్పాడు. తాను అండర్ వేర్‌లను అక్కడి నుంచే తెచ్చుకుంటానని నవ్వుతూ చెప్పాడు. సీఎం సోదరుడు, ఎమ్మెల్యే ఇలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ అంశంపై పేద నేతలు దేశ … Read more

    36వ జాతీయ క్రీడల వీడియో సాంగ్ రిలీజ్

    36వ జాతీయ క్రీడల వీడియో సాంగ్ విడుదలైంది. [వీడియోలో](url) మ్యూజిక్‌ బీట్‌కు తగినట్లుగా పలువురు క్రీడాకారుల విన్యాసాలు ఉత్తేజకరంగా ఉన్నాయి. ఇది విన్న పలువురు నిజంగా కనెక్ట్ అయ్యామని, బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ క్రీడలు గుజరాత్‌లోని 6 నగరాల్లో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10, 2022 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది యోగాసనం, మల్లఖంబ వంటి ఆటలు ఈ పోటీల్లో కొత్తగా చేరాయి. ఈ క్రీడలలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 7 వేల మంది అథ్లెట్లు, … Read more

    వరదల వేళ..బీజేపీ ఎంపీ దోశ ప్రమోట్

    బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాడు. వరదలతో బెంగళూరు ప్రజలు ఇబ్బందులు పడుతుండగా తేజస్వి మాత్రం దోశను తింటూ ప్రమోట్ చేస్తున్నాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 5న పద్మనాభనగర్‌లోని ఓ టిఫిన్ సెంటర్లో ‘దోశ’ తింటూ దాని రుచి బాగుందని, అక్కడికి వచ్చి ఈ ఫుడ్ టెస్ట్ చేయాలని తేజస్వి [వీడియోలో](url) చెప్పాడు. ఓ వైపు బెంగళూరులో ఇళ్లు మునిగి అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే, పరామర్శించాల్సింది పోయి టిఫిన్ తింటూ … Read more

    బ్రహ్మాస్త్ర టీమ్ కు చేదు అనుభవం

    ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రమోషన్లలో రణ్ బీర్, ఆలియా బిజీబిజీగా ఉన్నారు. తమ సినిమా విజయం సాధించాలని ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. అక్కడ వీరికి నిరసన ఎదురైంది. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆలయ ఆవరణలో ఆందోళన చేశారు. 11ఏళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో రణ్ బీర్ తనకు ‘బీఫ్’ ఇష్టమని చెప్పాడట. వాటిని ఇప్పుడు ట్రెండ్ చేస్తూ.. నిరసనకు దిగారు. దీంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. వీడియో కోసం Watch On పై క్లిక్ చేయండి. उज्जैन : फिल्म ब्रह्मास्त्र के … Read more

    ట్రాక్టర్లలో ఐటీ ఉద్యోగుల తరలింపు

    కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో వర్షాలకు అక్కడి ఉద్యోగులు నానా తంటాలు పడుతున్నారు. ట్రాక్టర్లు సహా పలు వాహనాల ద్వారా ఐటీ ఉద్యోగులను తరలిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు బెంగళూరు రోడ్లు, ఐటీ కారిడార్ సహా పలు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ఆఫీసులకు వెళ్లేందుకు ఐటీ ఉద్యోగులతోపాటు పలువురు అనేక అవస్థలు పడుతున్నారు. గంటల కొద్ది ట్రాఫిక్ ఏర్పడి అక్కడి సాధారణ ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈనెల 9 వరకు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ … Read more